ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ డయాబెటిస్ వచ్చిన వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. డయాబెటిస్ కంట్రోల్ అవ్వకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తాయి. అయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ డయాబెటిస్ పాదాలు,కిడ్నీలు, గుండె, నరాల మీద ఎంత ప్రభావం ఉంది అనేది ముందుగా తెలుసుకోవాలి. అయితే ఆలా అదుపులో పెట్టడం ఎలానో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


డయాబెటిస్ అదుపు అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 


డయాబెటిస్ వారు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.. ఇలా చెయ్యడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. 


సమయానికి ఆహారం తీసుకోవటం, మందులు వేసుకుంటే బరువు అదుపులో ఉండి షుగర్ కూడా అదుపులోకి వస్తుంది. 


డయాబెటిస్ ఉన్నవారు చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు ఉంటే చికిత్స తీసుకోవాలి. 


డయాబెటిస్ తీవ్రంగా ఉన్నవారు అధిక బిపి, కొలెస్ట్రాల్‌, కళ్ల పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయిన్చుకుంటే మంచిది. 


డయాబెటిస్ ఉన్న వారి గుండె రక్తనాళాలు మూసుకుపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకుంటే మంచిది.


పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలి.


ఇంకా డయాబెటిస్ ఉంటె ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అపుడే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంది ఆరోగ్యంగా తయారవుతారు. కాగా ఈ నెల 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం. 


మరింత సమాచారం తెలుసుకోండి: