మన చుట్టూ ఎన్నో రకాల మొక్కల దొరుకుతూనే ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్క ఆకు ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొన్ని చెట్ల నుండి ఆకులు, కాయలు కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందులో నేరేడు చెట్టు కూడా ఒకటి. నేరేడు కాయలు ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఇంక ఆ చెట్టు ఆకులో కూడా  అన్నే రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నేరేడు చెట్టు యొక్క ఆకులు, బెరడు, కాయలు ఇలా మొత్తం అన్నీ ఉపయోగపడతాయి. ఈ మొక్క ద్వారా చాలా రకాల వ్యాధులను తగ్గించవచ్చు. ఇందులో విటమిన్స్, క్రోమియం పుష్కలంగా లభిస్తాయి.

1). నేరేడు పండు చెట్టు యొక్క చిగురులు ప్రతిరోజు నాలుగు ఆకులు తినడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.

2). ఎక్కువ మల విసర్జన  అయ్యేవారు ఈ ఆకు యొక్క కషాయం తాగడం వల్ల దాని నుంచి విముక్తి పొందవచ్చు.

3). కాలేయం బాగా పని చేయాలంటే, ఈ ఆకు యొక్క కషాయం తాగడం వల్ల బాగా పనిచేస్తుంది.

4). ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు, ఈ కషాయం లోకి ధనియాలు వేసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది.

5). మూత్రం వచ్చేటప్పుడు మంట వచ్చినట్లయితే.. ఇక ఈ ఆకుల రసంలోకి నిమ్మకాయ రసం వేసుకొని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

6). అధిక బరువుతో బాధపడేవారు ఈ కషాయాన్ని వాడడం వల్ల దాని నుంచి విముక్తి పొందవచ్చు.

7). ఈ కషాయాన్ని ప్రతిరోజు నోటిలో పోసుకుని పుక్కిలించి నట్లయితే.. నోటి దుర్వాసన పోతుంది. అంతే కాకుండా నోటి లోపల పుండ్లు, గాయాలు కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అయినపుడు త్వరగా తగ్గిపోతుంది.

8). ఏవైనా పురుగులు , దోమలు కుట్టి దద్దుర్లు వచ్చినట్లయితే.. ఈ ఆకు రసాన్ని రాయడం వల్ల తగ్గిపోతుంది.

ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఒక గ్లాస్ నీటిని తీసుకుని, ఆ నీటిని వేడి చేస్తున్నప్పుడు, అందులోకి అప్పుడే కోసిన నేరేడు ఆకులను వేయాలి. ఈ కషాయం టేస్ట్ రావాలంటే ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: