కారం పొడి.. గుంటూరు మిరపకాయ కారం అంటే ఇక ఆ రుచే వేరని చెప్పవచ్చు.. ఈ మిరపకాయ కారం కూర లో పడితేనే ఆ కూరకు మరింత రుచి వస్తుంది.. చాలామంది తీపి పదార్థాలు తినడం కంటే స్పైసీగా హాట్ గా ఉండే పదార్ధాలను తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక అందుకోసమే వేడిగా , కారంగా ఉండే ఆహార పదార్థాలు తయారు చేసుకొని లేదా ఆర్డర్ పెట్టుకొని మరీ తింటూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ కారంపొడి అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలియక చాలా మంది ఎక్కువగా అన్ని వంటకాలలో అధికంగా ఈ కారంపొడిని ఉపయోగిస్తున్నారు.

ఎర్ర కారం పొడిని అధికంగా తీసుకున్నట్లయితే గుండెల్లో మంట, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు మరెన్నో సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే కారం పొడి అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


కారం పొడిని అధికంగా కూరలలో ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు.. ఒక వ్యక్తి తీసుకునే  ఆహార పోషకాలను నాశనం చేసే శక్తి ఈ కారంపొడి ఉంది.  పెద్దపేగుకు పుండ్లు ఏర్పడే ఆస్కారం కూడా వుంది. ఫలితంగా డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం  ఉంది. అంతేకాదు ఎప్పుడైతే కారంపొడి అధికంగా ఉండే ఆహారాలను తింటామో అప్పుడు వికారంగా కూడా కనిపిస్తుంది. కారం పొడి అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో పూత ఏర్పడడం, పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.. కారం అధికంగా ఉంటుంది కాబట్టి మిరపకాయ కారం పొడి తినడం వల్ల ఇలాంటి నోటి సంబంధిత సమస్యలు కూడా రావడం గమనార్హం.

ఎర్ర మిరపకాయ కారం ఎక్కువగా వాడడం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఆస్తమాతో బాధపడే వారికి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇక వీటితో పాటు గర్భధారణ సమయంలో శిశువుకి సమస్యలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: