ఈసారి ఎండా కాలంలో ఊహించినదాని కంటే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఉదయం సమయంలోనే కూడా ఎండ వేడిని తట్టుకోలేక పోతున్నారు జనాలు. మధ్యాహ్నం సమయం  లో అయితే ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటేనే భయపడి పోతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునేందుకు శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉండేందుకు పలు పానీయాలు తాగడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరికొంతమంది స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉండడం గమనార్హం.



 సాధారణం గా భగభగ మండి పోతున్న సూర్యుడి వేడి ప్రతాపం నుంచి తప్పించుకునేందుకు అటు మజ్జిగ ఎంతో మంచిది అని నిపుణులు చెబుతుంటారు  ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుందని అంతే కాకుండా శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటూ కాస్త ఉపశమనం పొందుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బయటికి ఎక్కడికైనా వెళ్లినా కూడా ఇక మజ్జిగ తాగడానికి ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నారు. కానీ కొన్ని సమయాలలో మాత్రం మజ్జిగ తాగడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.



 అయితే జలుబు జ్వరం అలర్జీ ఉన్నప్పుడు రాత్రి సమయం  లో మజ్జిగ తాగక పోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పొర పాటున మజ్జిగ తాగితే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే పిల్లలకు మజ్జిగ ఎక్కువ ఇవ్వొద్దు అంటూ సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక వెన్నెలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా పిల్లల గొంతు ఇన్ఫెక్షన్ జలుబుకు కారణం అవుతుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మజ్జిగ కు దూరం గా ఉండటం మంచిది అంటూ నిపుణులు సూచిస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: