
తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోర్స్ 3 చిత్రంలో మీనాక్షి చౌదరికి ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మరొక బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యింది .అయితే ఆ సినిమాలో ఈమె విలన్ పాత్ర ఆఫర్ చేయగా తనకు పాత్ర నచ్చి ఓకే చెప్పినట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి రెమ్యూనికేషన్ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి మొదటిసారి బాలీవుడ్ లో నెగిటివ్ పాత్ర చేస్తున్న మీనాక్షి చౌదరి కెరీర్ కి ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. టాలీవుడ్లో క్యూట్ లుక్స్ తో మెప్పించిన మీనాక్షి మరి బాలీవుడ్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
నిరంతర సోషల్ మీడియాలో వేకేషన్స్ సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో ,అభినయంతో సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్న మీనాక్షి చౌదరి వచ్చే ఏడాది నవీన్ పోలిశెట్టితో నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమాతో రాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్సి లభించింది. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ తోనే ఉండబోతున్నట్లు సమాచారం.