ఇటీవల కాలంలో అధిక బరువు అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అని చెప్పాలి. ఇక కొంతమంది నేటి తరం జీవనశైలికి బాగా అలవాటు పడి పిజ్జాలు బర్గర్లు అంటూ ఎక్కువగా తినేస్తూ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడంతో.. తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారు. అయితే ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చి ఇక ఆ బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక నేటి రోజుల్లో పరిస్థితి చూసుకుంటే అటు బరువు పెరగడం అయితే ఈజీ గానే పెరుగుతున్నారు. కానీ బరువు తగ్గడానికి మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొంతమంది ఇలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇక వ్యాయామం చేయకుండా బరువు పెరిగితే.. మరి కొంత మంది మాత్రం జీన్స్ కారణంగా ఇక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బరువు పెరిగిపోతూ ఉన్నారు. అయితే ఇటీవలే కాలంలో కొంతమంది ఇక తమ ఆహారం విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుని చివరికి బరువు తగ్గడం లేదా ఫిట్గా మారడం విషయంలో దృష్టి పెడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అయితే ఎంతో మంది ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.


 అయితే ఇక ఇలా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే 10 కిలోలు లేదంటే మహా అయితే 15 కిలోలు తగ్గడం చూస్తూ ఉంటాం. అది కూడా అతి కష్టం మీద. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం నాలుగేళ్ల సమయంలో 166 కేజీల బరువు తగ్గాడు. అదెలా సాధ్యమవుతుంది. అతను ఏదో సర్జరీ చేయించుకుని ఉంటాడు అని అనుకుంటారు ఈ విషయం తెలిసినవారు. కానీ సర్జరీ లేకుండానే ఇదంతా జరిగింది. అమెరికాలోని మినీ సిపీకి చెందిన నికోలర్స్ క్రాఫ్ట్ అనిఅనే 42 ఏళ్ళ వ్యక్తి 2019 నాటికి 295 కేజీల బరువు ఉన్నాడు. ఊబకాయంతో బాధపడేవాడు. ఈ క్రమంలోనే ఫ్యూచర్లో ఊబకాయం ప్రమాదంగా మారుతుందని డాక్టర్ హెచ్చరించడంతో తన ఆహారాన్ని అలవాట్లను మార్చుకొని నాలుగేళ్ల సమయంలో 166 కిలోలు తగ్గాడు. ఇప్పుడు అతని బరువు 129 కేజీలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: