పెరిగిన శరీర బరువును ఈజీగా తగ్గించడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో ఇంకా కొవ్వును తొలగించడంలో ఇప్పుడు చెప్పే టిప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్ర తినడానికి చాలా చేదుగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో ఈ నల్ల జీలకర్ర చాలా ఈజీగా లభిస్తుంది. నల్ల జీలకర్రను వాడడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. పొట్టలో ఉండే వివిధ రకాల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే మరో ఉపయోగించాల్సిన మరో పదార్థం అవిసె గింజలు. వీటిలో పోషకాలతో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల నల్ల జీలకర్రను తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. వీటిని ఒక చిన్న మంటపై దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో రుచి కోసం అర టీ స్పూన్ సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో అర టీ స్పూన్ పొడిని కలుపుకుని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి.ఇంకా అలాగే దీనిని తీసుకున్న అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మళ్ళీ రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.ఇక ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. శరీర బరువు ఈజీగా అదుపులో ఉంటుంది.తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండవచ్చు.ఇంకా అంతేకాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: