ముళ్ల గోరింట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలల్లో ఇది కూడా ఒకటి. ఇది వివిధ రంగుల్లో ఆకర్షనీయమైన పూలను కలిగి ఉంటుంది.ఈ మొక్క పూలను మాల లాగా కట్టుకుని జడలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, పసుపు ఇంకా నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ల గోరింట మొక్క ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది.ఇది చిన్న చిన్న ముళ్లులను కలిగి ఉంటుంది. ఇక ఈ మొక్క గుబురుగా 2 నుండి 4 అడుగుల ఎత్తులో పెరుగుతుంది.దీనిని కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా ముళ్ల గోరింట మొక్క మనకు చాలా బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం చాలా వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి పాదాలకు రాసుకోవడం వల్ల పాదాల పగుళ్లు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఈ మొక్కను సంస్కృతంలో వజ్రదంతి అని అంటారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల పళ్ళు వజ్రంలాగా మెరిసిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి అందులో ఉప్పు కలుపుకుని దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పాచి, గార ఇంకా పసుపుదనం తొలగిపోతుంది. ఈ మొక్క ఆకుల పేస్ట్ లో తేనె కలిపి వాడడం వల్ల దంతాల నుండి రక్తం కారడం ఈజీగా తగ్గుతుంది. ఈ మొక్కలతో డికాషన్ ను తయారు చేసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత ఇంకా నోటి దుర్వాసన వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఈ ఆకుల పేస్ట్ ను తామర, దురద వంటి చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల ఆ సమస్యలు ఈజీగా తగ్గు ముఖం పడతాయి. ఇంకా అలాగే ఈ మొక్క బెరడును నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగడం వల్ల కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. శరీరంలో చాలా ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఇంకా అలాగే ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి నొప్పులు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయి. ఇంకా అలాగే ముళ్ల గోరింట మొక్కను ఉపయోగించడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: