బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.100 గ్రాముల డ్రై బ్లూబెర్రీస్ లో 15 గ్రాముల నీటి శాతం, 319 కిలో క్యాలరీల శక్తి, 67.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, 2.4 గ్రాముల కొవ్వులు ఇంకా అలాగే 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చాలా బాగా శుభ్రపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ పండ్లు చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక 50 గ్రాముల బ్లూబెర్రీలను తీసుకోవడం వల్ల సహజంగానే అధిక రక్తపోటు 10 శాతం మేర తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అంతేకాకుండా బ్లూబెర్రీలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.ఇంకా అలాగే బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో ఈ పండ్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంపై ఉండే ముడతలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా బ్లూబెర్రీలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని పండ్ల రూపంలో లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎలా తీసుకున్నా కూడా మనకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: