గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 20 వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.

ప్ర‌ముఖుల జననాలు

1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799)  మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు.  హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది. బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు.

1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937). భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)
1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది.
1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999)
1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 1984లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: