బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇక్కడ తెలుపబడింది. ప్రతిరోజు బాదం లను తినటం వల్ల శరీరంలో ఎక్కువ స్తాయి గల 'లిపోప్రొటీన్'లను పెంచి, తక్కువ స్థాయి గల 'లిపోప్రొటీన్'లను తగ్గిస్తాయి. బాదం ఎక్కువగా మోనో సాకరైడేటేడ్ ఫాట్, ఆరోగ్యాన్ని పెంచే ఫాట్'ని కలిగి ఉంటాయి. ఒక రోజుకి 7 గ్రాముల బాదం తినటం వలన LDL- కొవ్వు స్థాయిలను 15 శాతం తగ్గిస్తాయి.

 రోజూ కొన్ని  బాదంపప్పులు తింటే  ఆరోగ్యం  మెరుగుప‌డుతుంద‌ని, వారు తీసుకునే ఆహారం సంపన్నం అవుతుందని తాజా పరిశోధన తెలుపుతోంది.  పౌష్టికాహారానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్- ఇ, మెగ్నీషియం వాటిల్లో ఉంటుందని ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన అలీస్సా తెలిపారు. ఇతరులు 3 నుంచి 6 ఏళ్ళ వయసు గల పిల్లలు. వారికి రోజుకు 14 గ్రాముల చొప్పున బాదం పప్పు ఇచ్చారు.

బాదం వల్ల కలిగే లాభాలు


వయోజనులు ఏయే ఆహారం, ఏమేరకు తీసుకున్నారో అన్నదానిని ఆన్ లైన్ లో పర్యవేక్షించడం ద్వారా పరిశోధకులు వారి ఆహార నాణ్యతను అంచనా వేయగలిగారు. వారు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆహారం నాణ్యతను గణించే ఆరోగ్యకర ఆహారం సూచిక ను తయారు చేశారు.  14 వారాల పాటు 29 బృందాల తల్లితండ్రులు, వారి పిల్లలకు ప్రతి రోజూ శాస్త్రవేత్తలు బాదం పప్పులను ఆహారంగా ఇచ్చారు. వయోజనుల్లో అత్యధికులు 35  సవంత్సరాలు వయసున్న తల్లులు. తల్లిదండ్రులు, పిల్లలు బాదం పప్పులు తీసుకుంటే వారు తినే ఆహార పదార్ధాల పౌష్టిక‌త  మొత్తంమీద పెరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: