మెంతులు వాడడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎలుకలపై మెంతులను వాడి ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎలుకల్లో బరువు తగ్గడం గమనించారు. కాబట్టి మెంతులు వాడడం వల్ల బరువు తగ్గుతారు.డాక్టర్ అన్నా డోరా జె. బ్రూస్ కెల్లర్ బృందం చేసిన అధ్యయనంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన బ్యాక్టీరియా పై అధిక కొవ్వు ఆహారాలు వల్ల కలిగే ప్రభావాలను మెంతుల్లో ఉన్నట్లు, అధ్యయనంలో తేలింది.అందువల్ల అధిక బరువు ఉన్నవారు వాడడం వల్ల బరువు తగ్గుతారని నిరూపణ అయింది.
నిద్రలేమితో బాధపడుతున్న వారు మెంతి ఆకులు రసం తీసుకొని రాత్రి భోజనానికి ముందు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఈ రసంలో నిమ్మకాయ పిండుకొని తాగడం వల్ల మధుమేహం తగ్గు ముఖం పడుతుంది.
రెండు చెంచాల మెంతులు సుమారుగా నాలుగు గంటలు నీటిలో నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ఆ నీటిలో తేనె కలుపుకొని సేవించడం వల్ల ఉబ్బస రోగం, కీళ్ల నొప్పులు ఉన్నవారికి మంచి మందులా పనిచేస్తుంది.
విరేచనాలు ఎక్కువగా అవుతుంటే వేయించిన మెంతిపొడిని మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల విరేచనాలు కంట్రోల్ అవుతాయి.
మెంతి పొడిని పాలతో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.అలాగే మెంతి పొడిని తలకు పట్టించుకుని దానం చేయడం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి