మనం తినే ఆహారంలో పెరుగు కు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం తినేటప్పుడు చివరగా పెరుగు అన్నం తింటేనే భోజనం సంపూర్ణమైనది గా భావిస్తాం. ప్రతిరోజు పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలను సమకూర్చి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్  మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.  పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ , లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మన శరీరానికి అవసరమైన మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి.  

పెరుగు తినడం పై  కొన్ని అపోహలు ఉన్నాయి పెరుగును రాత్రి పడుకునేటప్పుడు తినకూడదని అలా చేస్తే బరువు పెరుగుతారని, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని  ఆరోగ్యానికి మంచిది కాదని కొందరి వాదన అది ఏంటో ఇప్పుడు చూద్దాం!

పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. పెరుగును ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడయినా ఆహారంగా తీసుకోవచ్చు అయితే అది తగిన మోతాదులో ఉండునట్లు చూసుకోవాలి ఒక గరిటెడు పెరుగు  లేదా పల్చటి మజ్జిగ తీసుకోవడం ఉత్తమం అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.

పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటలలోపు తినేసేయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది.

ముఖ్యమైన విషయం పెరుగులో పంచదార వేసి తీసుకోవడం చాలా ప్రమాదకరం . శరీరానికి వేడి చేయడమే కాకుండా, శరీర బరువు పెరిగి ఊబకాయ సమస్య లు, గుండె సంబంధిత వ్యాధులు, బాధపడాల్సి వస్తుంది.                                                                                                                                                

ఆవు పాల కంటే గేదె పాలలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వయసు మళ్ళిన వారు గేదె పెరుగు ఆహారంగా తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. ఇలాంటి వారు ఆవు పాలతో తయారుచేసిన పెరుగు తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: