కొన్ని ప్రాంతాల్లో రాగులను విరివిగా పండిస్తున్నారు. రాగులతో రొట్టె, ముద్ద, జావా చేసుకొని తినవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచివి. చిరుధాన్యాల్లో రాగులు చాలా బలవర్థకమైనవి. కష్టం బాగా చేసే వాళ్ళు రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొనడం వల్ల నూతన శక్తి వస్తుంది.ముఖ్యంగా రాగి జావ చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.అంతేకాకుండా రాగుల్లో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రాగి జావ తీసుకోవడం మంచిది.రాగుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.రాగి పిండి లో పీచు పదార్థం కూడా ఉంటుంది. దీనివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది.

 బిపి, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి.రాగి జావ లో ఐసొల్యూసిన్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

 రాగులు బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే అమినో యాసిడ్స్,ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది.కాబట్టి తక్కువ తినడానికి అవకాశం ఉంది. దీనివల్ల బరువు తగ్గుతారు.రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కూడా ఆకలి అనిపించదు.

 రాగులతో తయారు చేసినా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎందుకంటే రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.ఎముకలు బలంగా ఉండటానికి రాగి మాల్ట్ తీసుకోవడంవల్ల ఎముకలు,బలంగా ఉంటాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రాగులు మంచి మందుగా పని చేస్తాయి. ఎలా అంటే రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మెథినోన్ ఉండడంవల్ల శరీరంలోని కొవ్వు చేరకుండా చేస్తాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

 తరచు రాగులతో చేసిన పదార్థాలు తినడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె బలహీనత,ఉబ్బసం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా శరీరానికి శక్తి లభిస్తుంది.

 అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఎందుకంటే రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: