రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి జ్యోతి శాస్త్రం తో పాటు, వాస్తు శాస్త్రం కూడా దానికి కొన్ని సూచనలు ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తున్నారు. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తల కింద పెట్టుకోవడం వల్ల అంతగా నిద్ర వస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అధిగమించడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి నిద్రించే ముందు సూచనలు పాటించడం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. అవి ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం...
పిల్లలు నిద్ర పోయేటప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. నిద్రలేచి ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి సమయంలో పిల్లల దిండు కింద కత్తెర లేదా ఏదైనా ఇనుప వస్తువును పెట్టాలి. ఇలా చేయడం వల్ల మూల ప్రతికూల శక్తి పిల్లల వద్దకు రాకుండా ఉంటుంది. ఫలితంగా హాయిగా నిద్ర పోతారు.
పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా నిద్ర పోయేటప్పుడు చెడు ఆలోచనలు వచ్చినా, చెడు కలలు వచ్చినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దిండు కింద ఇనుప వస్తువులు పెట్టడం వల్ల నిద్ర ప్రశాంతంగా వస్తుంది.
మనసులో భయాలు, ఆందోళన, కలలు వస్తున్నా దిండు కింద హనుమాన్ చాలీసా పెట్టుకోవడం మంచిది. లేదా చదువు కోవడం కూడా చేయవచ్చు. ఇలా చేయడంవల్ల నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అలాగే పీడకలలు రాకుండా ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండడం వల్ల నిద్ర హాయిగా వస్తుంది.
నిద్రపోయే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా నిద్ర హాయిగా వస్తుంది. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి.
నిద్రపోయేటప్పుడు కొన్ని సోంపు గింజలను తీసుకొని దిండు కింద పెట్టుకోవడం వల్ల రాహు దోషాన్ని అధిగమించవచ్చు. పీడకలలు, మానసిక సమస్యలు రాకుండా సోంపు గింజలు కాపాడుతాయి. అలాగే యాలకులను పెట్టుకోవడం వల్ల కూడా నిద్ర పడుతుందని పెద్ద వాళ్ళు చెబుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి