వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చెట్టును పూర్వకాలం నుంచి ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. వేప చెట్టు అనేక అనారోగ్యాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.  వేప ఆకులు, పువ్వులు, పండ్లు, బెరడు ఇలా చెట్టు మొత్తం ఔషధాల గుణాలున్నాయి. రోజు ఉదయమే కొన్ని వేపాకులను తినడం వల్ల శరీరానికి  అవసరమైన ప్రొటీన్లు, కార్బో  హైడ్రేట్లు, ఇనుము, కాల్షియం,  ఫైబర్ వంటివి అన్నీ పుష్కలంగా అందుతాయి. పరగడుపున వేపాకు తినడం వల్ల ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు  రాకుండా ఉంటాయి. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...

 రోజు ఉదయం వేపాకు జ్యూbస్ తీసుకోవడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఎందుకంటే వేపాకులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా అస్పెర్ గిల్లస్, కాండిడా ఆల్బకాన్స్, మైక్రోస్పోరం జిప్సం వంటి వ్యాధుల కారకాలపై ఈ వేపాకు జ్యూస్ పనిచేస్తుంది.                                       

 కడుపున వేపాకులు తినడం వల్ల కొన్ని  వ్యాధి కారకాలను దూరం చేస్తుంది.సాల్మనెల్ల, వంటి  హానికర బ్యాక్టీరియాతో  పోరాడి దానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 రక్తాన్ని శుద్ధి చేయడానికి పరగడుపున యాప్ ఆకులు తినడం మంచిది. అలాగే రక్తంలోని విష  పదార్థాలను,  మలినాలను బయటకు పంపుతుంది. ఇంకా కేన్సర్లను రాకుండా నిరోధిస్తుంది.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు వేపాకులను తినడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. క్రమంగా వేపాకు తినడం వల్ల గానీ, జ్యూస్ తాగడం వల్ల గాని చేయడంవల్ల డయాబెటిస్ దరిదాపుల్లో రాదు.

 వేపాకులు చర్మ  వ్యాధులను కూడా దూరం చేస్తాయి. సొరియాసిస్, తామర, మొటిమలు వంటివి వాటికి వేపాకు ఔషధము లా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు వేపాకు జ్యూస్ తాగడం వల్ల తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: