రోజూ బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఆకలిని తగ్గించడంలో పప్పు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే బాదంపప్పులు మెగ్నీషియం, యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి తక్కువ తింటారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
చాక్లెట్లు తీసుకోవడం వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఆకలిని బాగా తగ్గిస్తుంది. ఇందులో స్టీరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. అందుకే రోజు డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకోవాలి. ఆకలి ఉండదు కాబట్టి తక్కువ తినే అవకాశం ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
దాల్చిన చెక్క ను తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంతేకాకుండా స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీని వల్ల మధుమేహం వచ్చే అవకాశం తక్కువ. అలాగే చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. నీ వల్ల తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు. కాబట్టి ఏదో ఒక రూపంలో దాల్చిన చెక్కను తీసుకోవడం మంచిది.
మెంతులు కూడా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. అంతేకాకుండా అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గ్లాస్ నీటిలో మెంతులు నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉండడంవల్ల క్రమంగా బరువు తగ్గుతారు.
ఆహారంలో భాగంగా అల్లం ను చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. మీ ఆకలిని చాలాసేపు కలగకుండా చేస్తుంది. అల్లం తో చేసిన టీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా, తగ్గడానికి సహాయపడుతుంది. అల్లమును ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి