
ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం చాలా మంచిది. కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల కావలసిన పోషకాలు, విటమిన్లు అందుతాయి. ఇందులో భాగంగానే దొండకాయ కూడా ఒకటి. దొండకాయ కూర చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఆహారంలో భాగంగా దొండకాయలు చేర్చుకోవడం వల్ల మలబద్దక సమస్య సులువుగా తగ్గుతుంది. ఎందుకంటే దొండకాయలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయ గోడలను బలంగా ఉండేటట్లు చేసి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే పేరు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు దొండకాయ తినడం చాలా మంచిది. ఇది రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దొండకాయలు తినవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతుంది.
దొండకాయను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది ఆస్తమా, బ్రోన్కైటిస్, వంటి శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా దొండకాయలో స్టేరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, అధికంగా ఉంటాయి. ఇవి అలర్జీలు రాకుండా కాపాడుతాయి. ఉబ్బసం వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
క్రమం తప్పకుండా దొండకాయలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ హిస్టమిక్ ప్రభావాలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల రాడికల్స్ వల్ల ఏర్పడే నష్టాన్ని కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యవంతమైన కణజాలాన్ని పెంచడానికి సహాయపడుతాయి. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇందులో ఉండే యాంటీ- హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది.ఇందులో ఉండే బి-విటమిన్ నాడీవ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం