మన ఇంట్లో వండుకునే వంటలు తినడానికి రుచి కరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట కొనుగోలు చేసి తీసుకొనే వంటల కంటే , మన ఇంట్లో చేసుకునే ఏ వంటలైనా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలు లేదా పచ్చళ్ళు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు బయట కొని తెచ్చుకున్న పచ్చళ్ళు ను తింటుంటే వాటిని మానేయండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి .అలానే ఆర్టిఫిషియల్ కలర్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు. కనుక వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసి వాటిని తినడం మంచిది.
ఊరగాయలు, పచ్చళ్ళు తినడం వలన ఎండ ,వేడిని తట్టుకోగలిగే శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల్ని ఉప్పులో కలిపి ఊరబెట్టుతూ ఉంటాము. అయితే అలా పచ్చళ్లు ఊరడం వల్ల ఎంతో రుచిగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మన పెద్ద వాళ్ళు ఫర్మెన్ టేషన్ ప్రాసెస్లో నూనె వేసి మెంతిపొడి, జీలకర్ర పొడి,ధనియాల పొడి,మెంతులు ఇలా పచ్చడిని బట్టి పదార్ధాలు ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి కేవలం ఇంట్లో తయారు చేసే పచ్చడి లో మాత్రమే ఉంటాయని అంటున్నారు.
ఇటువంటివి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, వీటి వల్ల ఎలాంటి హాని ఉండదని అంటున్నారు. మనకి బయట దొరికే ప్యాకెట్ ఉరగాయలు ,పచ్చళ్ళు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల వల్ల ఒబేసిటీని తరిమికొడతాయి అని , డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా మంచి శక్తి సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయని, కొవ్వుని కరిగించే తత్వం కూడా ఉందని అంటున్నారు.
మనం పచ్చళ్లను తీసుకోవడం వల్ల మనకి B12 మరియు విటమిన్ డి 3 ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ఒంట్లో విటమిన్స్ తక్కువగా ఉంటే మీరు వీటిని తినవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి