సమస్య- మాది ప్రేమ పెళ్లి. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడే వివాహం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మా వివాహబంధంలో ఎలాంటి పరిమళాలు ఉండట్లేదు. అది డ్రై గా అయిపోయింది. నాకు నా భర్తని చూస్తే ఎలాంటి ఫీలింగ్ రావడం లేదు. మేమిద్దరం మా ఉద్యోగ పనుల్లో బిజీగా గడిపేస్తాం. మేము కలిసి ఒక్క దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన తన ఫోన్‌తో చాలా బిజీగా ఉంటాడు. నేను నా పనులు నేను చేసుకుంటూ బిజీగా ఉంటాను. మా మధ్య మాకు ఇలాంటి పరిమళాలు పుయట్లేదు. ఇలా ఫీల్ అవ్వడం సహజ లక్షణమైనా..?
నిపుణుల సమాధానం- మీరు మీ సమస్యని మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం బాధగా ఉంది. వివాహ బంధాన్ని కాపాడుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయిన వారు కూడా వివాహ జీవితంలో ఆ స్పార్క్ పోగొట్టుకోవడం ఎంతో సహజమైన విషయమని చెప్పవచ్చు. మీ ఫీలింగ్స్ కూడా పూర్తిగా నార్మలు మాత్రమే..
మీకు రిలేషన్ షిప్ గురించి ప్రస్తుతం అంత ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా సహజమైన అంశమే. అయితే ఈ ఫీలింగ్ ని ఇంకా పెంచుకోవద్దన్నది నా సలహా. ఇంతేకాక మీ బంధంలోకి ఆ ప్రేమను తిరిగి తెచ్చుకోవడం కూడా సులభమే.
**అవి ఏంటో చూద్దాం**
1) మీ పార్ట్నర్ ని ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందో అడగండి. వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మాట్లాడండి.
2) ఇంట్లో పనులు ఇద్దరు కలిసి చేసుకోండి. బయట పనులకి కలిసి వెళ్ళండి. ఇందువల్ల రోజువారి మీ లైఫ్లో మీరిద్దరూ కలిసి గడపగలుగుతారు. దీంతో ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ షిప్ వస్తుంది.
3) మీ ఇద్దరూ మాత్రమే రెగ్యులర్ గా రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లోనైనా కావచ్చు బయట కావచ్చు.
4) మీ పార్ట్నర్‌తో కలిసి ఏవైనా చిన్న చిన్న జోక్స్, చెప్పుకోండి. అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఇంకా ఎక్కువ అర్ధం చేసుకోగలుగుతారు. మీ కొత్త జీవితానికి నాంది పలుకుతారు. అంతేకాక, మీరు దగ్గరిగా తనం ఫీల్ అవ్వాలంటే మీ ఇద్దరూ ఒకరితో ఒకరు మొహమాటం లేకుండా అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. మీకు నచ్చని విషయాలు అవతలివారు చెప్పిన మారకుండా నిజమేదో, అబద్దమేదో తెలుసుకోవాలి. చివరికి నిజాయితీ విశ్వాసాలే మీ ఇద్దర్నీ ఒకరితో ఒకరిని బలంగా కలిపి ఉంచగలగుతాయి. నీకు ఇంకా ఏదైనా సహాయం కావాలి అనుకుంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్లి వారు సహాయం తీసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్ ఎంతో మంది జంటలకు బాసటగా నిలిచింది. ఈ సూచన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి