కరోనా సమయంలో భారతదేశంలో  అది ఎక్కువగా యాంటీబయాటిక్ మందులను వాడినట్లు ఓ అధ్యయనం తెలిపింది.  భారతదేశంలో  కరోనా  ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత యాంటీ బయాటిక్ మందులు అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వీరు చేసిన సర్వేలో తేలింది . స్వల్పంగా కరోనా వచ్చిన వారికి  చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్ మందులను అమ్మినట్లు తెలుస్తున్నది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సర్వే చేశారు.

 గత సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇండియాలో దాదాపు 21.6 కోట్ల డోసుల యాంటీ బయాటిక్ మందులు వాడినట్లు వారు తెలిపారు. వీటికి తోడుగా  మరో 3.8 కోట్ల  డోసులు అజిత్రోమైసిన్ మందులు ఎక్కువగా అమ్ముడు పోయినట్లు ఈ స్టడీలో గుర్తించారు. భారీ స్థాయిలో యాంటీబయోటిక్ వినియోగం మానవ ఆరోగ్యానికి మంచిది కాదని  సర్వే చేసిన సీనియర్ సైంటిస్ట్ సుమంత్ గండ్ర తెలిపారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు యాంటీబయటిక్ వల్ల ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు. అతిగా యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల  కొన్ని మందులతో తగ్గే రోగాలు త్వరగా నయం కావని స్పష్టం చేశారు. అమెరికాలోని బర్న్ ఎస్ జువ్వి హాస్పిటల్లో  సుమంత్ అసోసియేట్ గా                  చేస్తున్నారు. వ్యాధి నిరోధక మందులను ఎక్కువగా వాడటం వల్ల సాధారణంగా వచ్చే న్యుమోనియా లాంటి వ్యాధుల్ని నయం చేయడం ఇబ్బందిగా మారిందని ఆయన తెలిపారు.

అమ్మకాలపై  నిర్వహించిన సర్వేలో పిఎల్వోఎస్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. జనవరి 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇండియాలోని ప్రైవేట్ హెల్త్ సెంటర్ లో అమ్ముడు పోయిన యాంటీబయాటిక్ మందుల వివరాలను  ఈ స్టడీలో తెలిపారు. ఇండియాకు చెందిన   ఐక్యూవీఐఏ బ్రాంచ్ నుంచి వివరాలను సేకరించారు. కెనడాలోని  మైకిల్ యూనివర్సిటీ కూడా ఈ స్టడీలో భాగస్వామిగా  ఉన్నది.  కరోనా మహమ్మారి వేళ చాలా దేశాల్లో అజిత్రోమైసిన్ మందులు ఎక్కువగా అమ్ముడు అయ్యాయని తెలిపింది. భారతదేశంలో అజిత్రోమైసిన్ మందుల అమ్మకాలు నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగినట్లు తమ సర్వేలో పేర్కొంది. శ్వాసకోశ వ్యాధుల ఇన్ఫెక్షన్ లకు వాడే డ్రాక్సీ సైక్లిన్, పారో పెనాన్  లాంటి మందులు అమ్మకాలు కూడా పెరిగినట్లు తెలియజేసింది. సంపన్న దేశాల్లో మాత్రం ఈ మందులు అమ్మకాలు  వినియోగం తగ్గినట్లు గుర్తించారు. భారతదేశంలో మాత్రం కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఈ యాంటీబయాటిక్ మందులను వాడినట్లు తమ ఫలితాల్లో వెల్లడయ్యాయని పరిశోధకులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: