ఈ తిప్పతీగ గురించి తాజాగా ఓ జర్నల్ లో వచ్చిన అధ్యయనం ఇప్పడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ఈ తిప్ప తీగ వల్ల కాలేయం దెబ్బ తింటుందన్న ఓ వ్యాసం వచ్చింది. దీనిని బేస్ చేసుకుని పేపర్లలో పుంకాను పుంకాలుగా వార్తలు రాసేశారు. దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖాధికారులు తీవ్రంగా స్పందించడంతో పాటు తిప్ప తీగపై వస్తోన్న వార్తలు అన్నీ అవాస్తవాలు అని కొట్టి పడేశారు. ఈ తిప్ప తీగ తినడం వల్ల ముంబైలో ఆరుగురు కాలేయం దెబ్బతిందని పుకార్లు ప్రచారం చేయడంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ మండిపడింది.
నిజానికి తిప్పతీగ వల్ల కాలేయం దెబ్బతిన్నదని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని ఆయు ష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే తిప్పతీగ తో పాటు ఇప్పుడు కరోనా కోసం వాడుతోన్న మన దేశ మూలికలు, ఆయుర్వేదం అంతా కాలేయాన్ని సక్రమంగా పనిచేసేలా చేస్తాయంటున్నారు. గతంలోనే ఈ పరిశోధనలు జరగగా... ఈ విషయాన్ని ఫ్రూవ్ అయ్యాయని వారు చెపుతున్నారు. ఇక ఒక్క తిప్ప తీగ మీదే ఇప్పటి వరకు 169 పరిశోధనలు చేస్తే అవన్నీ తిప్ప తీగ రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని వెల్లడైందన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి