కోవిడ్ అలర్ట్... జీడీజీ మార్గదర్శకాలు షురూ
 కరోవా వ్యాధి నివారణకు  పలు ప్రభుత్వాలు బలవంతంగా వేయిస్తున్న టీకా లు వద్దంటూ ప్రపంచ వ్యాప్తంగా నిరసన సెగలు రోజు రోజుకూ  పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్ ఓ) ఎప్పటి కప్పుడు కోవిడ్-19 పై  తన మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. గైడ్ లైన్ డెవలప్ మెంట్ గ్రూప్ (జిడిజి) కమిటీ  కరోనా వ్యాధి గ్రస్తులకు  ఇచ్చే  చికిత్స కు సంబంధిీంచి తాజాగా మార్గద్శకాలను విడుదల చేసింది.  ప్రపంచ ఆరగ్య సంస్థకు వాటిని అందజేసింది. కోవిడ్ -19 సోకడం వల్ల ఆసుపత్రులలో చేరి ప్రాణాలు పోగొట్టకునే వారు ఎక్కు వవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ట్రీట్ మెంట్ పై  జడిజి చేసిన కొన్ని ప్రయోగాలు, వాటి ఫలితాల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించింది.

 యాంటీ బాడీ చికిత్స ద్వారా కరోనా మహమ్మారి పై పోరాడవచ్చని జిడిజి తెలిపింది. కాసిరివిమాబ్, ఇండెవిమాబ్ లు మోనోక్లోనల్ యాంటీ బాడి చికిత్సలు.  మొదటి రకం కాసిరివిమాబ్ యాంటీ బాడీ చికిత్స. ఇది కరోనా వ్యాధి బాధితుల్లో పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు. అయితే  ఈ చికిత్స వ్యాధి తీవ్రరాపం దాల్చకుండా నివారిస్తుంది. ఫలితంగా రోగి ఆసుపత్రిలో చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముప్పు పెద్దగా ఉండక పోవచ్చు.. ఇక రెండోది,ఇండెవిమాబ్  చికిత్స. ఈ యాంటీ బాడీ చికిత్స కరోనా  వ్యధి ముదిరి,  ఆసుపత్రి పాలై, కొన ఊపిరితో ఉండే వారికి అందిస్తారు. వీరిని  వైద్య పరిభాషలో  సీరో నెగటివ్ రోగులుగా వ్యవహరిస్తారు. ఈ రోగుల్లో యాంటీబాడీలు స్పందన ఉండదు. కొందరిలో స్పందన  మోదలుకాదు కూడా. ఈ ప్రయోగాల ద్వారా తెలుసుకున్న కొత్త విషయాలను అనుసరించి  జిడిజి తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ యాంటీ బాడీ చికిత్సల వల్ల కరోనా బాధితులకు జరిగే మేలు ఏమిటంటే... ఈ యాంటీ బాడీలు కరోనా  రోగులకు అందించడం వల్ల  శరీరంలో ఉన్న కొవిడ్-19 వైరస్ లోని   స్పైక్ ప్రొటీన్ కు యాంటీబాడీలు అంటుకుంటాయి. ఫలితంగా ఇన్ ఫెక్షన్ కలిగిన వైరస్ కణాల సామర్ధ్యాన్ని అవి తగ్గిస్తాయి.
 కాగా  జిడిజి ఇదే  సమయంలో బాంబు లాంటి  మరో  విషయాన్ని కూడా చెప్పింది. ఈ యాంటీ బాడీ చికిత్స చాలా ఖర్చు తో కూడుకున్నదని తెలిపింది. సామాన్యులకు అందుబాటులో ఉండదని తేల్చి చెప్పింది. చిన్న చిన్న దేశాలలో ఈ చికిత్శ లు అందించడం అంత సులభం కాదనింది. కేవలం  అత్యంత సంపన్నులు మాత్రమే ఈ చికిత్స చేయించుకోగలుగుతారని జిడిజి అభిప్రాయపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: