
ఈ జాబితాలో తరువాతి స్థానాలలో కాంగో 105, మొజాంబిక్, సియర్రా లియోన్ 106, తిమోర్ లెసై 108, హైతీ 109, లిబియా 110, మడగాస్కర్ 111, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగో 112, చాద్ 113, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 114, యెమన్ 115, సోమాలియా 116 స్థానాలలో ఉన్నాయి. భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ 92, నేపాల్, బంగ్లాదేశ్ 76 స్థానాలలో కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఈ అధ్యయనం కేవలం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో కూడా ఎక్కడ ఆకలి బాధలు లేకుండా చేయడానికి వీలు అవుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు చేశారు.
అయితే దీనిని బట్టి 2030 నాటికీ 47దేశాలలో ఆకలి లేని సమాజాన్ని తీసుకురావడం సాధ్యం అయ్యే పని కాదని అధ్యయన కారులు అంటున్నారు. ఇక్కడ వారికి పౌష్టికాహార లోపం, పిల్లలలో వయసు తగ్గ బడుగు లేకపోవడం, ఎత్తు లేకపోవడం అలాగే ఆకలితో చనిపోవడం లాంటివి సంభవించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు వారు. అయితే ఈ జాబితా 100 పాయింట్ల ర్యాంకింగ్ ద్వారా తయారు చేశారు. అంటే జీరో వచ్చిన వారి దేశంలో ఆకలి బాధలు లేవని, 100 ర్యాంకు వచ్చిన వారి దేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా 20.4 గా ఉన్న ఈ స్థితి ఒక్కసారిగా 25.1 శాతానికి పడిపోయిందని వారు తెలిపారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపం ఉందని, దీనివలన మిగితావి తయారవుతాయని వారు తెలిపారు.