కరోనా లో దొంగ కరోనా కూడా ఉంది. వైరస్ లో ఏ వైరస్ ఉన్నా  కోవిడ్ పాజిటివ్ గా చూపించడం మామూలైపోయింది. కరోనా, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లో లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మైగ్రేన్ ఫీవర్ తో పాటు ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. పడుకోని లేవాలంటే బాగా నీరసంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గుతో ఆగిపోతే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ గా భావించవచ్చని, అయితే ఇది పూర్తిగా వాస్తవం అని చెప్పలేమన్నారు. కేవలం దగ్గు, గొంతు నొప్పి తో టెస్ట్ చేయించుకున్న కొందరిలోనూ కరోనా నిర్ధారణ అవుతోందన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించామన్నారు.

జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తే ప్రతి పది మందిలో ఎనిమిది నుంచి తొమ్మిది మందిలో కరోనా ఉందని, అదే జ్వరం లేకుండా దగ్గు, జలుబు,గొంతునొప్పి, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు చేస్తే పది మందిలో ఒకరిద్దరి లోనే వైరస్ బయటపడిందని గచ్చిబౌలి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యులు తెలిపారు. డెల్టా వేరియంట్ లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఓమిక్రాన్ లో ఈ లక్షణాలు ఉండటం లేదని జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు,దగ్గు లాంటివి ఉంటే ఆందోళన అవసరం లేదు.

మాస్క్ ధరించి వైద్యుల సూచన మేరకు ఆయా లక్షణాలకు సంబంధించిన మందులను తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం, ఉప్పు నీళ్లు పుక్కిలించడంతో పాటు వేడి ఆహారం తీసుకోవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం,కాచి చల్లార్చిన నీళ్లు తాగడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే మూడు నాలుగు రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోతాయి. అయితే ఓమిక్రానా,సాధారణ ఫ్లూనా అని గుర్తించడంలో కొంత గందరగోళమయితే ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: