చాలా మంది అలసట నుండి ఉపశమనం పొందడానికి ఒక రోజులో మూడు నాలుగు సార్లు టీ, కాఫీ లు త్రాగడానికి ఇష్టపడతారు. మరి కొందరు గంట గంటకి టీ, కాఫీ తాగే అలవాటును కలిగి ఉంటారు. కానీ ఈ అలవాటు మీ రక్త పోటును అధికంగా పెంచుతుంది. రక్తపోటును నియంత్రించుటకు మీరు టీ, కాఫీ వినియోగాన్ని తగ్గించుకోవడం చాలా శ్రేయస్కరం. ఇందులో ఉండే కెఫీన్ మరియు ఇతర రసాయనాలు బీపీ రావడానికి సహాయపడుతాయి. దీర్ఘకాలం సంతోషంగా జీవించాలంటే టీ కాఫీలను నిషేధించండి.
ఇక ఈ ప్రపంచంలో దాదాపు చాలా రోగాలు వైట్ రైస్, షుగర్ మరియు సాల్ట్ లను అధికంగా తీసుకోవడం వలన ఎక్కువగా ప్రాణ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో తగిన మేరకు మాత్రమే ఉప్పును వినియోగించాలి. అధికంగా తీసుకోరాదు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే బయట ఫుడ్ ని ఎక్కువగా తీసుకోరాదు అనడానికి ఇది కూడా ఒక కారణం. ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఉప్పును ఆహారంలో పరిమితికి మించి వినియోగించరాదు.
ఇక మానవుని ప్రాణాలను హరిస్తున్న మధ్యపానము ఎంత ప్రమాదమో తెలిసిందే. ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వలన కూడా రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి మద్యపానానికి మరియు పొగాకుకు దూరంగా ఉండాలి.
పైన తెలిపిన మూడు అలవాట్లను మార్చుకోగలిగితే మీ జీవితం బీపీ బారిన పడకుండా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి