తీవ్రమైన పని ఒత్తిడి వల్ల.. శారీరకంగా, మానసికంగా ఆందోళన సమస్య వల్ల మనకు కంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేని సమస్య వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది అని చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైతే మన తినేటటువంటి వాటిలో దినచర్యల మార్చుకోవాలని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. శరీరంలోని పోషకాల లోపాన్ని తొలగిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కళ్ళకింద నల్లటి వలయాలను తగ్గించుకునేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.



శరీరంలో ఐరన్ ఎక్కువగా లోపించడం వల్ల ఇలాంటి ప్రభావం వల్ల కళ్ళ చుట్టూ నల్లగా కనిపిస్తుందట. అటువంటి పరిస్థితిలో కళ్ళు ఉబ్బినటున్నట్లుగా కూడా కనిపిస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఆహారంలో అరటిపండు, బచ్చలి కూర, ఆకుకూరలు, బ్రౌన్ రైస్ వంటివి ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువగా ఐరన్ దొరుకుతుంది.


మెరుగైన కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ కూడా చాలా అవసరం. ఈ విటమిన్ కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా సహాయపడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలతో పాటు, మొటిమలు ముడతలు కూడా ఎక్కువగా వస్తాయట. ఈ విటమిన్ లోపాన్ని  అధిగమించాలంటే.. టమోటా, చేపలు, రెడ్ క్యాప్సికమ్ వంటివి తింటూ ఉండాలి.


విటమిన్ సి లోపం వల్ల కూడా ముఖం చుట్టూ ముడతలు ఏర్పడి చర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతాయి. కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించుకోవడానికి విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తినాలి. ముఖ్యంగా నారింజ, నిమ్మ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.


విటమిన్ ఇ లోపం వల్ల మన శరీరానికి సరిపడే ఆక్సిజన్ అందకుండా ఉంటుంది దీని వల్ల చర్మం, కళ్లపై కూడా దీని ప్రభావం పడుతుంది. అయితే వీటిని అధిగమించాలి అంటే గుడ్లు, వాల్నట్లు, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి వంటి ఆహారంలో చేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: