ప్రతి ఒక్క స్త్రీకి బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక అదృష్టంలాగా భావించి కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.డాక్టర్లు సజెస్ట్ చేసిన ప్రకారం టాబ్లెట్లు మరియు టానిక్కులు వాడుతూ వారి డైట్లను మార్చుకుంటూ కూడా ఉంటారు.మరీ ముఖ్యంగా పెద్దలు బిడ్డ మరియు తల్లి ఇద్దరి కోసం బోజనాలు తినాలని చెబుతూ ఎక్కువ పెడుతూ తినమని చెబుతూ ఉంటారు.దీనివల్ల వారి వెయిట్ గైన్ అవడమే కాకుండా, లోపల ఉన్న బిడ్డకు హాని కలగడం,సుఖ ప్రసవము కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అవగాహన లోపం వల్ల అతిగా తినడం కన్నా, ఆహార నిపుణులు చెప్పే కొన్ని రకాల డైట్లను ఫాలో చేయడం చాలా మంచిది.సుఖప్రసవం కోసం ఎలాంటి డైట్లను మనం ఫాలో అయితే మంచిదో,ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

పాలు..

రోజు ఉదయాన్నే కాఫీ టీ బదులుగా పాలు తీసుకోవడం చాలా ఉత్తమం ఇందులో నుంచి వచ్చే కాల్షియం సుఖప్రసాద్ కి దోహదపడటమే కాకుండా, బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.కాఫీ టీ తాగడం వల్ల అందులోని కేపెన్ గ్యాస్ కి ఫోన్ చేయడమే కాకుండా, బిడ్డ ఎదుగుదలను కూడా ఆపేస్తుంది.

బాదం

నానబెట్టిన బాదం పోషకాల బాంఢాగారం అని చెప్పవచ్చు.దీనిలో ఎన్నో మినరల్స్,పొటాషియం,ఐరన్, విటమిన్ ఇ లు పుష్కలంగా లభిస్తాయి.రోజూ తీసుకోవడంతో బాదం మీకు అవసరమైన శక్తిని ఇస్తుంది.ఇందులో ఉండే విటమిన్ ఇ మీ పిల్లల మెదడు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.

ఆకుకూరలు..

ఏదో ఒక ఆకుకూర భోజనంలో తినడం అలవాటు చేసుకోవాలి.ఇందులో ఉన్న విటమిన్ కె,మెగ్నీషియం,విటమిన్ E,ఐరన్ మరియు జింక్ సుఖప్రసవానికి తోడ్పడుతాయి.కావున గర్భిణీ స్త్రీలు రోజుకు 100 గ్రామ్స్ ఏదో ఒక ఆకుకూరని తీసుకోవడం ఉత్తమం.

గుడ్లు..

గుడ్లలో కాల్షియం,ప్రోటీన్,విటమిన్-బి12 లు పుష్కలంగా లభిస్తాయి.కడుపుతో ఉన్న ప్రతి స్త్రీ గుడ్లను తినడం వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు మెదడు, వెన్నుపాము బాగా అభివృద్ధి దోహదపడతాయి. గుడ్లలోని ప్రోటీన్,కాల్షియం మీకు,మీ బిడ్డ ఎముకలను బలంగా ఉంచి,ప్రసవం అయ్యేందుకు సహాయపడతాయి.

పండ్లు..

సీజనల్ వచ్చే పండ్లను రోజుకు ఏదో ఒకటి తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న ప్రోటీన్ మరియు విటమిన్ సి సుఖప్రసమయం అయ్యేందుకు దోహదపడతాయి. కావున ప్రతి ఒక్కరు ఈ పైన చెప్పిన ఆహారాలన్నీ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ,సుఖప్రసవమయ్యేందుకు జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: