ప్రస్తుతం చాలా మంది కూడా డయాబెటిస్  సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ డయాబెటిస్ సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు.మామూలుగా డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో అని భయపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా షుగర్ ని అదుపులో ఉంచుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం రకరకాల చిట్కాలను పాటించడంతో పాటుగా ఇంగ్లీష్ మందులను కూడా తరచూ వాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఆయుర్వేద చిట్కాలను వంటింటి చిట్కాలను పాటించి చాలా వరకు అనారోగ్య సమస్యలను దూరం చేసుకుంటున్నారు. అయితే మరి మన వంటింట్లో దొరికే కొన్ని రకాల పదార్ధాలతో షుగర్ ను ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.డయాబెటిస్  ఉన్నవారికి బీరకాయ చాలా బాగా పనిచేస్తుంది.


ఎందుకంటే బీరకాయ తినడం వల్ల శరీరంలో ఏదైనా పుండ్లు ఉంటే ఆ పుండ్లు మానిపోవడంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. ఇంకా అలాగే డయాబెటిస్ పేషెంట్లు మజ్జిగలో నానబెట్టిన మెంతులను తినడం వల్ల తొందరగా డయాబెటిస్ ను ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే రాత్రి మజ్జిగలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా అదుపులో ఉంటుంది. అయితే మజ్జిగ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉత్త నీటిలో  మెంతులు నానబెట్టి ఆ మెంతులను ఉదయాన్నే తినడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.ఇక తిన్న తర్వాత కచ్చితంగా ఒక అరగంట సేపైనా వాకింగ్ చేయడం చాలా మంచిది. డయాబెటిస్ తగ్గడానికి అలాగే మానసికంగా కృంగిపోకుండా ముందు ధైర్యంగా ఉంటూ ఆహరం మార్చుకొని దానికనుగుణంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ తగినంతగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా ఉంటే డయాబెటిస్ అనే సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: