జ్వరం వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం. ఆ ఆహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.జ్వరం వచ్చినప్పుడు టీ,కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. వీటిలో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది. దీంతో మనం తగిన విశ్రాంతి తీసుకోలేకపోతాము. అలాగే ఆల్కాహాల్ ను కూడా తీసుకోకూడదు.ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే నూనెలో వేయించిన ఆహారాలను, ప్రాసెస్ట్ ఆహారాలను, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. దీనిలో ఉండే కొవ్వులు జీర్ణక్రియను కష్టతరం చేస్తాయి. వీటికి బదులుగా జ్వరం వచ్చినప్పుడు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ ఉంటే ఆహారాలను తీసుకోవాలి. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి జ్వరం వచ్చినప్పుడు ఉండే గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలను మరింత ఎక్కువ చేస్తాయి.


అలాగే జ్వరం వచ్చినప్పుడు తృణ ధాన్యాలు, బీన్స్ తో పాటు అధిక ఫైబర్ ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి జీర్ణం అవ్వడానికి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. దీంతో కడుపులో అసౌకర్యం వచ్చే అవకాశం ఉంటుంది.జ్వరం వచ్చినప్పుడు పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. కొందరిలో ఇవి శ్లేష్మాన్ని పెంచుతాయి. జ్వరం వచ్చినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తీపి పదార్థాలను, శీతల పానీయాలను కూడా తీసుకోకూడదు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. శరీరంలో ఇన్పెక్షన్ తో పోరాడే కణాలను అడ్డుకుంటాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ ను మరింతగా పెంచుతాయి. ఇవే కాకుండా మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడదు. జ్వరం వచ్చినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా జ్వరం వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నీరసం, జ్వరం నుండి త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: