ఈమధ్య చాలా మంది ఇళ్లల్లో దోమలు సర్వసాధారణంగా ఉంటున్నాయి.. అయితే గతంలో ఎక్కువగా వర్షాకాలంలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉండేవి కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి.. మారిన వాతావరణం వల్ల ఇవి ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.. చలికాలంలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని సీజన్లోని ఎక్కువగా ఉంటున్నాయి.. ఈ సీజన్లో ఎక్కువగా కరెంట్ కోత ఉంటుంది.. ఈ సమయంలోనే దోమలు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రజలను.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కుడుతూనే ఉంటాయి.


దీనివల్ల మలేరియా, డెంగి వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది.. అయితే కొన్ని రకాలు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లోనే ఉండే దోమలు సైతం బయటికి తరిమేయవచ్చు.. దోమల బెడద నుంచి వదిలించుకోవడానికి చాలా మంది.. ఎక్కువగా మస్కిటో కాయిల్స్, రీఫిల్స్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటి ద్వారా వచ్చే గాలిని బీల్చడం వల్ల ఎన్నో రకాలైన సైడ్ ఎఫెక్టు కూడా వస్తుంటాయని వైద్యులు తెలియజేస్తూ ఉంటారు.. అలా కాకుండా నేచురల్ గానే దోమలను బయటికి పారాదోలాలి అంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది..


ముఖ్యంగా నిమ్మకాయ, కర్పూరం ,లవంగాలు, ఆవనూనె ఒత్తులు వంటివి తీసుకొని.. తల భాగంలో నిమ్మకాయను కాస్త కట్ చేసి ఆ తర్వాత అందులో ఉండే గుజ్జుని తీసివేసిన తర్వాత నిమ్మకాయలో లవంగాలు వేసి ఆవ నునేను వేసి వత్తివేసి  దీపం లాగా వెలిగించాలి ఆ తర్వాత కిటికీలు అన్ని మూసివేసి ఏదైనా మూల ఉంచడం వల్ల దోమలు ఈ వాసనకు ఊపిరాడక చచ్చిపోతాయట.. అయితే ఈ దీపం నుంచి వచ్చే పొగ వాసన దోమలకు అసలు సరిపోదని దీంతో వెంటనే ఇంట్లో ఉండే దోమలు కూడా బయటికి వెళ్లిపోతాయట. లేకపోతే వేపాకు పొగ పెట్టడం వల్ల కూడా ఈ దోమలు బెడద మరింత తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: