గుమ్మడి విత్తనాలలో అధికంగా జింక్ మరియు మెగ్నీషియం,ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.గుమ్మడి విత్తనాలను డైరెక్ట్ గా తీసుకోవడం కన్నా,రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇలా రాత్రంతా నానబెట్టిన గుమ్మడి విత్తనాలను గర్భిణీ స్త్రీలు తినడంతో వారి ఆరోగ్యానికి మేలు చేకూరడమే కాక,వారి బిడ్డ ఎదుగుదలకు మరియు ముఖ్యంగా పిల్లల మెదడు పెరుగుదలకు ఇందులో ఉన్న జింక్ చాలా బాగా దోహదపడుతుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది హార్ట్ సమస్యలతో బాధపడుతున్నారు.ముఖ్యంగా మగవారు గుమ్మడి విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారికి నడివయసులో వచ్చే హార్ట్ ఎటాక్ హార్ట్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.మరియు పురుషులలో అధికంగా చూసే స్పెర్మ్ సమస్యలు కూడా తొలగిపోతాయి.అంతే కాక రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ క్రమబద్దీకరించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడి,మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
గుమ్మడి విత్తనాలు విటమిన్ ఈ కి పుట్టినిల్లు అని చెప్పవచ్చు.అందువలన గుమ్మడి విత్తనాలను వారి రోజువారి డైట్ లో వారి చర్మ సమస్యలు తొలగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గుమ్మడి విత్తనాలను పెద్దవి చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఒకవేళ చిన్నపిల్లలు తినడానికి అంత ఇష్టం చూపకపోతే వారికి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు లాగా తయారు చేసి ఇవ్వడం చాలా ఉత్తమం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి