
ఉదయం లేవగానే ఎక్కువ శాతం మంది మొబైల్ చూస్తుంటారు. కానీ, ఇకపై ఉదయం లేచిన వెంటనే కిటికీ తీయండి లేదా బయటకు వెళ్లి తాజా గాలి పీల్చండి. ఇది మీ మనసు ప్రశాంతంగా ఉంచి, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత కనీసం 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తపోటును సహజంగానే తగ్గిస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్, రాగి జావ, జొన్న రొట్టి, ఉడకబెట్టిన కూరగాయలు, సలాడ్, పప్పులు, బాదం, వాల్‌నట్స్ వంటివి చేర్చండి. ఎక్కువ ఉప్పు, చక్కెర, ఆయిల్ ఉన్న పదార్థాలు తప్పించండి. డాక్టర్ సూచించిన మందులు సమయానికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
దాల్చిన చెక్క షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో దాల్చిన చెక్క టీ తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారికి మెంతులు కూడా సూపర్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. రాత్రి మెంతి గింజలు నానబెట్టి, ఉదయం ఆ నీరు తాగడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
ఇక వారంలో రెండు, మూడు సార్లు బీట్‌రూట్ రసం తాగడం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని తులసి ఆకులు కలిపి తీసుకున్నా రక్తపోటు అదుపులో ఉంటుంది.