గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 13వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1930: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.

ప్ర‌ముఖుల జననాలు

1899: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982)
1904: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982) విజయనగరం జిల్లా, సాలూరు గ్రామంలో నవంబరు 13, 1904 సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు మహాత్మాగాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం, ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
1914: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
1917: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1920: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992). గణిత శాస్త్రంలోని "నంబర్ థియరీ"లో ప్రసిధ్దులు. ఆయన రచనలు భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కె.జి.రామనాథన్ దక్షిణ భారతదేశం లోని హైదరాబాదులో జన్మించారు. ఆయన హైదరాబాదు నిజాం కళాశాలలో బి.ఎ చదివారు.మద్రాసు లయోలా కాలేజి నుండి ఎం.ఎ (గణిత శాస్త్రం) ను 1942లో చేసారు.తొలుత అన్నామలై విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు లెక్చరర్ గా (1945-46), హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా (1947-48) పనిచేసి పి.హె.డి నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలోని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తిచేసారు. ఆయన డాక్టరల్ అడ్వైజర్ "ఎమిల్ ఆర్టిన్". ఆయన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో "హెర్మన్ వైల్", "కార్ల్ సైగెల్: లతొ కలసి పనిచేసారు. ఆయన 1951లో భారతదేశానికి తిరిగివచ్చి కొలాబా లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో కె.చంద్రశేఖరన్ బృందంలో పనిచేసారు.

1925: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005)
1926: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992)
1935: పి.సుశీల, భారతీయ సినీ గాయని.
1957: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.
1967: జుహీ చావ్లా, భారత సినీనటి.


ప్ర‌ముఖుల మరణాలు

1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.
1974: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
1976: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్‌, సంపాదకుడు.
2002: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
2010: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928)

మరింత సమాచారం తెలుసుకోండి: