సాధారణంగా కొంత మంది పిల్లలు షార్ప్ గా ఉండరు. వారు ఏదైనా గ్రహించడానికి, కే=నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. అలాంటి పిల్లల మెదడును షార్ప్ చేయడానికి ఈ ఆహారపదర్దాలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. పిల్లలకు పిండి పదార్థాలు, ప్రోటీన్ అల్పాహారం కోసం తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలు అందించాలన్నారు. అయితే పిల్లలకు గుడ్లు ప్రోటీన్. ఇక గుడ్డు శిశువు జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

అలాగే చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వలన మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకునే పిల్లలు పదునుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక వోట్స్  కూడా పిల్లల జ్ఞాపక శక్తిని పెంచడానికి దోహదపడుతాయి. అయితే పిల్లలలో మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, జింక్ కూడా వీటిలో ఉంటాయన్నారు.

ఇక కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే టమోటాలు, చిలగడ దుంపలు, తీపి గుమ్మడికాయలు, క్యారెట్లు, బచ్చలికూర వంటి  కూరగాయలను మీ పిల్లల ఆహారంలో చేర్చాలని అంటున్నారు. అందులో చాలా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కూరగాయలను సూప్‌లో చేర్చవచ్చునని అన్నారు.

అంతేకాదు.. పాలు, పెరుగు జున్ను పాలు పిల్లలకు అందించాలని అన్నారు. అయితే పెరుగు, జున్నులో ప్రోటీన్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయన్నారు. ఇక ఇవి మెదడు అభివృద్ధికి అవసరం అన్నారు. అవి మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ ఆహారాలలో అధిక మొత్తంలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది బలమైన ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల అభివృద్ధికి అవసరం అన్నారు. అంతేకాక బీన్స్ లో ప్రోటీన్, విటమిన్లు ఖనిజాల పుష్కలంగా లభిస్తాయి. ఇవి పిల్లల ఆలోచనల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: