ఇక ప్రస్తుత రోజుల్లో పిల్లల ఆరోగ్య విషయాలను గురించి తల్లిదండ్రులు అనేక రకాలుగా చింతిస్తూ ఉంటున్నారు. అయితే ముందే ఈ రోజుల్లో పిల్లలు ఔట్డోర్ గేమ్స్ ఆడడం పూర్తిగా మరిచిపోతున్నారంటే... ఈ మహమ్మారి కారణంతో మనమే వారిని బయట ఆడడం వద్దని వారిస్తూ ఉంటున్నారు. ఇక అటువంటి సమయంలో వారికి ఇళ్లు, ఫోన్లే ప్రపంచంలా మారిపోయి జీవనం సాగిస్తున్నారు. అంతేకాక.. వారిలో మలబద్దకం సమస్య ఉద్బవించడానికి ఇది కూడా ఒక కారణమే అని ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఒకరు తెలియజేశారు.
అయితే ఈ లాక్ డౌన్ వలన పిల్లలు అధికంగా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఇక పిల్లల్లో మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుందని, మలబద్దకం సమస్య దూరమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే పిల్లల్లో మలబద్దకం అదే తగ్గిపోతుందిలే అని ఎప్పుడు కూడా అనుకోకూడదని వైద్యులు తెలిపారు. ఇక ఇలా మలబద్దకం సమస్య వచ్చినందుకు పిల్లలను మనం నిందించలేమని అన్నారు.
కాగా.. అలా సమస్య రావడం ఎంత మాత్రము వారి తప్పు కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మలబద్దకం సమస్య రావడానికి ప్రధాన కారణం మన జీవనశైలి, మనం తింటున్న ఆహార పదార్థాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అంతేకాక.. అసలు ఈ రోజుల్లో పిల్లలు బయటకు వెళ్లి ప్రకృతి ఒడిలో ఆడుకోవడమే మర్చిపోయినట్లు తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి