ప్రస్తుతం కరోనా కాలం కాబట్టి పిల్లల తిండిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో పిల్లలు తినే తిండి సరిగా లేకపోతే వారికి భవిష్యత్తులో రోగాలు దరిచేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా పదిహేనేళ్ల లోపు పిల్లలకు ఆహారం అందించేటపుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అన్నారు.

అంతేకాకుండా పిల్లలకు పరీక్షల సమయంలో సరైన ఆహారం అందించడం కూడా తెలియాలని పేర్కొన్నారు. అంతేకాక.. పిల్లలకు రోజుకి మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మోడల్ కంటే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకి నాలుగైదు సార్లు కొంచెం కొంచెంగా పెట్టడం మంచిదని సూచించారు.

అంతేకాదు.. పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్ యొక్క సరిపోలే పదార్థాలను ఇంట్లోనే తయారు చేసి వారికి పెట్టాలని అన్నారు. ఇక పరీక్షల సమయంలో ఇవ్వాల్సిన ఆహారం ఏంటో ఒకసారి చూద్దామా. పిల్లలకు పరీక్షలు అయ్యే వరకూ బయటి ఆహారం తినకుండా చూసుకోవాలని అన్నారు. అయితే ఆ ఫుడ్ వలన కొన్నిసార్లు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఈ సమయంలో కొత్త రకాల ఆహార పదార్థాలను అందించకూడదని అన్నారు.

అలాగే పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం వేయించిన వేరుశనగ పప్పు, నట్స్, ఖాక్రా వంటివి లేట్ నైట్ తినడానికి వీలుగా ఉంటుందని సూచించారు. ఇక బిస్కెట్లు, కుకీలు, కేక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే నమ్కీన్స్ వంటివి ఎవాయిడ్ చేయాలని అన్నారు. అంతేకాదు.. మైదా, పంచదార, ప్రిజర్వేటివ్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్న ఫుడ్స్ కూడా వద్దని తెలిపారు. ఇక పరీక్షల సమయంలో పిల్లలను ఎక్కువగా ఒకేచోట కూర్చోని చదువుతుంటారు. ఆలా కాకుండా పిల్లలు కూడా కొన్ని నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలని అన్నారు. ఇక ప్రతి గంటకీ ఒక సారిలేచి స్ట్రెచ్ చేయడం, కాసేపు వాకింగ్ చేయటం వంటి వాటి వల్ల యాక్టివ్‏గా ఉంటారని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: