మానసిక ఆరోగ్యం.. మనిషికి కాళ్ళు లేకపోయినా.. చేతులు లేకపోయినా.. ఆఖరికి కళ్ళు లేకపోయినా మానసిక ఆరోగ్యం ఉంటే చాలు జీవితంలో ఉన్నతస్థాయిలో ఉంటారు. అందుకే మానసిక స్థితి బాగుండాలి అంటే మెడిటేషన్ చెయ్యాలి.. మంచి వాతావరణంలో ఉండాలి. అప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. 

 

ఇంకా ఈ కాలంలో మనకు ఎక్కువగా లభించే పువ్వులు మల్లెపువ్వులు. ఇంకా అలాంటి మల్లెపువ్వులు పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెపువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. అందాన్ని కూడా అంతే ఎక్కువ ఇస్తాయి. అలాంటి మల్లెపువ్వులు ప్రయోజనాలు మాములుగా ఉండవు. 

 

మల్లెపూలు నీటిలో వేసుకొని గంట తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తే శరీరం, మనసు తేలికపడతాయి. పూల సువాసనతో ఒళ్ళు మంచి వాసనతో వస్తుంది. 

 

రోజంతా బయట తిరిగటం వల్ల ఒత్తిడికి గురై కళ్ళమీద విరిసిన మల్లెలను ఉంచితే ఆ ఒత్తిడి తగ్గుతుంది. 

 

ఇంకా చుండ్రు బాధితులు మెంతులు, ఎండుమల్లెలు కలిపి నూరి తలకు పట్టిస్తే సమస్య తగ్గి జుట్టు పట్టులా మెరిసిపోతుంది.

 

మల్లెపువ్వులను కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత మరగనిచ్చి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

 

గుప్పెడు మల్లెల్ని నూరి ముద్దచేసి కొద్దిగా పాలు కలిపి ముఖం అంత మర్దన చేసుకొని ఆ తర్వాత అరచెంచా చొప్పున ముల్తానామట్టి, గంధం, తేనె కలిపి పేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం తాజాగా మారి మెరిసిపోతుంది.

 

మల్లెపూల రసం, గులాబీ పువ్వుల రసం, గుడ్డు పచ్చ సొన కలిపి ముఖానికి  రాసి కాంతవంతంగా తయారవుతుంది. 

 

మల్లెల నూనెను మొటిమల మచ్చల మీద రాస్తే మచ్చలచర్మం రంగులో కలిసిపోతాయి.

 

మల్లెపూల నూనె, లావెండర్‌ నూనె కలిపి ఒళ్ళంతా మర్దనా చేస్తే శారీరక అలసట తొలగటమే కాక, మానసిక ఒత్తిడి దూరం అవుతాయి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించండి మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: