కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో అనేకమైన చిత్రవిత్రాలను జరుగుతున్నాయి. అలానే ప్రజలపై కఠినమైన ఆంక్షలు అనేక ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం తమ ప్రజల పై ఒక విచిత్రమైన ఆంక్ష విధించింది. అదేంటంటే భార్యాభర్తలు బంగారంలో పాల్గొనకూడదని ఆదేశించింది. భార్య భర్తలు ఏ సందర్భంలోనూ కలయిక లో పాల్గొనకూడదని బ్రిటిష్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు చేయడం గమనార్హం. లండన్, టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని.. ఆ ప్రాంతాల్లో కొద్ది రోజుల పాటు భార్య భర్తలు శృంగారంలో కలవకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రాంతాల్లో భార్యా భర్తలు సామాజిక దూరం పాటించడంతో పాటు అన్ని ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


అయితే ఒకే ఇంట్లో నివసిస్తున్న దంపతులు శృంగారంలో పాల్గొనవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం తెలిసింది. కానీ ఎవరైతే దూరప్రాంతాల్లో నివసిస్తూ రద్దీ ప్రాంతాల్లో తిరుగుతారో వారు మాత్రం ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని బ్రిటిష్ ప్రభుత్వం హెచ్చరించింది. కొందరు దంపతులు పని నిమిత్తం ఆఫీసులకు వెళ్తుంటారు. అయితే అలాంటి వాళ్లు కూడా శృంగారం లో పాల్గొనడానికి వీలులేదని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శృంగారంలో పాల్గొనటం పాల్గొనకపోవడం తమ ఇష్టమని.. తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కులేదని.. అక్కడి ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.


అయితే అక్కడి ప్రజలు ఆగ్రహం పై స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం.. కొన్ని రోజుల పాటు సామాజిక దూరం పాటించక తప్పదని.. లేకపోతే కుటుంబ సభ్యులందరూ కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని.. అందుకే ఈ నిబంధనలను పాటించాలని ప్రజలను కోరుతున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏదేమైనా బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరం విస్తుపోయేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: