బతుకమ్మ పండుగ వచ్చిందంటే వీధులంతా పాటలతో ఆటలతో మారుమ్రోగి పోతుంటాయి. అయితే బతుకమ్మ ఆడడానికి పాటలు చాలా ముఖ్యం. గతంలో మహిళలంతా కలిసి ఈ పాటలు పాడేవారు. ముఖ్యంగా అమ్మమ్మలు నానమ్మలు లాంటి పెద్ద వయసు ఉన్న వారు పాటలు పాడుతుంటే చిన్న వయసు వారు ఆ పాటను అందుకొని మరోమారు పదాలు పలికే వారు. ఈ దృశ్యం చూడడానికి ఎంతో కనువిందుగా ఉండేది. పాటలు కూడా ఎంతో వినసొంపుగా ఉండేవి. అయితే నిజానికి అది వారసత్వం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వారు పాడిన పాటల్ని మళ్లీ ఒకసారి పాడడం వల్ల అసలు పాటలు పాడడం రాణి వారికి కూడా అది కంఠస్తం అయ్యేది. అలా ఒక తరం నుంచి మరో తరం ఈ బతుకమ్మ పాటలను నేర్చుకునేవారు.

వారు తన తర్వాత తరం వారికి వారు నేర్చుకున్నట్టు గానే పాటలను నేర్పించేవారు. అయితే ఇప్పుడు తరం మారింది కదా అలాగే పాటల విధానం మారిపోయింది. డీజే బాక్స్ లో హోరెత్తించే ధూమ్ దాం సాంగ్స్ తో మరింత హుషారుగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేటి యూత్. ఆ పాటల్లో ' ఓ నిర్మల' అనే సాంగ్ ఒకటి. 'ఘల్లు ఘల్లునా' అంటూ మారుమ్రోగి కంచు కంఠంతో సింగర్ పాడే ఈ సాంగ్ బతుకమ్మకు సరిగ్గా సరిపోయింది.

 ప్రతి ఏడాది బతుకమ్మ వచ్చిందంటే ఈ సాంగ్ కచ్చితంగా వినిపిస్తుంది. అలా ఈ బతుకమ్మ స్పెషల్ సాంగ్ తెలంగాణ వాసులకు ఫేవరెట్ అయ్యింది. ఫోక్ సింగర్ ఒళ్ళాల వాణీ ఈ పాటను తన కంచు కంఠంతో మారు మ్రోగించారు. సిక్స్ టీవీ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ పాటను స్పెషల్ గా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాటకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. దాదాపు రెండు కోట్లకు పైగా ఈ పాటను వీక్షించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: