ముక్కు దిబ్బడని తగ్గించే సింపుల్ టిప్?

చలికాలం వచ్చేసింది. ఇక దగ్గు, జలుబు అనేవి చాలా కామన్. ముఖ్యంగా ముక్కు దిబ్బడ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అస్సలు ఊపిరి ఆడనివ్వదు. అయితే దీనికి కొన్ని సింపుల్ టిప్స్ తో చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఆ సింపుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మంచి రుచికరమైన స్పైసీ ఫుడ్ బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడంలో మీకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగనీ మరీ కారం ఉన్న పదార్థాలు మాత్రం అసలు తీసుకోవద్దు. దీనివల్ల వేరే అనారోగ్య సమస్యలు వస్తాయి.ప్రస్తుత రోజుల్లో అనేక రకాల నాసల్ స్ప్రేలు మార్కెట్‌లో వస్తున్నాయి. అవి బ్లాక్ అయిన ముక్కును తెరుస్తాయి. మీకు కావాలంటే డాక్టర్ సలహాపై వీటిని ఉపయోగించవచ్చు.ఇక ముక్కు మూసుకుపోవడం వల్ల మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే మీరు దీనిని సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం మీరు వేడి నీటిని తాగడం ప్రారంభించండి. 


మంచి ఫలితాల కోసం, తేనె, అల్లం రసాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగాలి. ఇది బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడమే కాకుండా, దగ్గును కూడా దూరంగా ఉంచుతుంది.ఇంకా ముక్కు మూసుకుపోవడం, జలుబు అలాగే దగ్గు సమస్యలను అధిగమించేందుకు ఎన్నో రకాల ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి. అందులో ఆవిరి విధానం కూడా ఒకటి. ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. పైగా దీని ప్రభావం కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ఇందుకోసం ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి, ఆ తర్వాత మీ తలను ఒక టవల్‌తో కప్పి, ఆపై ఆవిరి తీసుకోండి.అప్పుడు శ్వాస తీసుకోవడం చాలా సులభం అవుతుంది. కొంతమంది వ్యక్తులు విక్స్‌ లేదా అమృతాంజన్‌ని కూడా వేడి నీటిలో కలుపుకుంటారు. దీని ప్రభావం మరింత తీవ్రంగా కూడా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: