ఇటీవల కాలంలో మన జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ప్రతి ఒక్కరు తరచూ ఏదో ఒక అనారోగ్య బారిన పడుతున్నారు.  ఇప్పటికాలంతో పోల్చుకుంటే పూర్వకాలంలో ప్రజలు ఎక్కువగా ఆయుర్వేదం పైన ఆధారపడేవారు.  కాబట్టి ఏ సమస్య వచ్చినా చిన్న చిన్న పద్ధతులతోనే సమస్యను తొలగించేవారు.  కానీ అత్యాధునిక ప్రపంచంలో ఆయుర్వేద చికిత్సల కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల తక్షణమే ఉపశమనం కలిగినా దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా మైగ్రేన్, తలనొప్పి వంటి బాధించే సమస్యలతో బాధపడుతున్నట్లయితే తమలపాకుతో ఇలా ట్రై చేసి చూడండి.

తలనొప్పి అధికంగా భావిస్తున్నప్పుడు..  మీ పెరటిలోని రెండు తమలపాకులను తీసుకొని చేతిలో నలిపి దాని ద్వారా వచ్చే రసాన్ని నుదుటి పైన రుద్దాలి.. లేదా తమలపాకులను డైరెక్ట్ గా నుదుటి పైన పెట్టి ఏదైనా గుడ్డ సహాయంతో కట్టు కట్టి నిద్రపోవాలి.  అయితే రాత్రి సమయంలో ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది . మీ తలలో ఉండే వేడిని తమలపాకులు గ్రహిస్తాయి.  తద్వారా తలనొప్పి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది . ఇలా వరుసగా కొద్దిరోజులు చేశారంటే త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఈ తమలపాకు ఆరోగ్యంగానే కాదు సాంప్రదాయంగా  కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

మన భారతదేశంలో పెళ్లి అయిన పేరంటమైనా నోమైనా,వ్రతమైన ఇలా ఏ శుభకార్యమైనా తప్పక తమలపాకులు ఉండాల్సిందే.... పూర్వకాలంలో భోజనం తర్వాత అందరూ తప్పనిసరిగా తాంబూలాన్ని స్వీకరించేవారు. అంతేకాదు తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకునేవారు. పూర్వం మన పెద్దవాళ్లు తమలపాకును ప్రతి శుభకార్యంలోను ఉపయోగించేవారు. నాగవల్లి దళం అనే తమలపాకు దేవతా దళము. తొటిమలో లక్ష్మీదేవి, మధ్యభాగాన పరమేశ్వరుని సతి పార్వతి దేవి, కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతి దేవి ఉంటారు. ఇంద్రుడు, మన్మధుడు, విష్ణువు,శివుడు, బ్రహ్మ తమలపాకుపై సదా కొలువుతీరి ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: