
స్పైసెస్:
వీటిని వంటల్లో వాడటంతో,ఆహార రుచిని పెంచుతాయి, కానీ ఇవి శరీరంలో వేడిని పెంచడానికి కూడా దోహదం చేస్తాయి.దీనివల్ల డిహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే చాలా మంచిది.
మాంసాహారాలు:
మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అజీర్తి,మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.
జంక్ ఫుడ్ : చాలామంది పిల్లలకు సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఎక్కువగా జంక్ ఫుడ్ ని ఇస్తుంటారు. అలాంటి పిల్లల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, కడుపునొప్పి,గ్యాస్ మరియు తిన్నది సరిగా అరగక వాంతులు వంటి రోగాలు,మొదలవుతాయి.
నివారణ చర్యలు..
వేసవికాలంలో మనం తినే ఆహారాల మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ సీజన్లో మన శరీరం ఎక్కువగా డిహైడ్రేట్ కాకుండా, పెరుగు వంటి పదార్థాలు తినడంతో కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగి, జీర్ణసమస్యలు రాకుండా కాపాడడమే కాక, శరీరానికి చలువనందిస్తుంది.
నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు:
నీటి శాతం ఎక్కువగా ఉన్న దోసకాయ,పుచ్చకాయ,నిమ్మకాయ వంటి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో నీటిశాతం అధికంగా ఉండడంతో శరీరం డిహైడ్రెట్ కాకుండా కాపాడుతాయి. మరియు ఇందులోని ఫైబర్ కంటెంట్ తొందరగా జీర్ణం అవ్వడానికి దోహదపడతాయి. ఉల్లి, పుదీనా ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇందులోని పోషకాలు, హిట్స్ స్ట్రోక్ నుండి శరీరాన్ని కాపాడుతాయి. కావున వేసవిలో ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం చాలా ఉత్తమం.