ఉలవలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన పూర్వకాలంలో వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. ఉలవలతో చేసిన కారం పొడి, ఉలవల చారు ఇంకా గుగ్గిళ్లు వంటివి తయారు చేసి తీసుకునేవారు.అయితే వీటిని ఎక్కువగా గుర్రాలకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఇక కాలం మారుతున్న కొద్ది వీటి వాడకం కూడా తగ్గుతూ వచ్చింది. కానీ ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇవి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవలతో చేసిన చారును తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.మన శరీరంలో వాతాన్ని తగ్గించడంలో ఈ ఉలవలు అద్భుతంగా పని చేస్తాయి. ఉలవచారును తీసుకోవడం వల్ల వాతం వల్ల కలిగే నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఉలవలను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా చాలా ఈజీగా బయటపడవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఇంకా ధృడంగా తయారవుతుంది. నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలనేవి మన దరి చేరకుండా ఉంటాయి.


రోజంతా కష్టపడి పని చేసే వారు ఉలవ చారును తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఉలవల నుండి తీసిన పాలను బాలింతలకు ఇవ్వడం వల్ల వారిలో పాల శాతం కూడా పెరుగుతుంది. ఈ ఉలవలను ఉడికించి మెత్తగా రుబ్బాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని గుడ్డలో వేసి పిండగా వచ్చిన పాలల్లో పంచదార వేసి బాలింతలకు ఇవ్వాలి. ఉలవలను తీసుకోవడం వల్ల రేచీకటి సమస్య ఈజీగా దూరమవుతుంది. ఉలవచారును వేడి వేడిగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు ఇంకా కఫం వంటి సమస్యలు ఈజీగా దూరమవుతాయి.అలాగే గర్భాశయ దోషాలను దూరం చేసే గుణం కూడా ఉలవలకు ఉంది. ఉలవచారును తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు ఈజీగా తగ్గడంతో పాటు తెల్లబట్ట సమస్య కూడా తగ్గుతుంది. ఉలవచారును తీసుకోవడం వల్ల విరోచనాలు కూడా తగ్గు ముఖం పడతాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య క్రమంగా తగ్గుతుంది. ఈ విధంగా ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: