మనలో చాలా మంది కూడా అరికాళ్లు, అరి చేతుల్లో మంటలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్లల్లో మంటలు రావడానికి ప్రధానంగా రెండు కారణాలనేవి ఉంటాయి.ఇక అందులో మొదటిది విటమిన్ బి 12 లోపం. అలాగే రెండోది షుగర్ జబ్బు. వయసు పైబడడం వల్ల కొందరిలో విటమిన్ బి 12 లోపం అనేది తలెత్తుతుంది. ఈ విటమిన్ లోపించడం వల్ల కూడా అరిచేతుల్లో ఇంకా అరికాళ్లల్లో మంటలు వస్తూ ఉంటాయి. విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ మంటలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా అరికాళ్లల్లో మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో ఉండే కణాలకు రక్తప్రసరణ సులువుగా జరగకపోవడం వల్ల, రక్తనాళాలపై ఉండే పొరలు దెబ్బతినడం వల్ల ఇలా మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఇలా అరికాళ్లల్లో మంటలతో బాధపడే వారు షుగర్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి అదుపులో ఉంటే అరికాళ్లల్లో మంటలు కూడా క్రమంగా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఈ అరికాళ్లల్లో మంటలు రావడానికి గల కారణాలను తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం ఖచ్చితంగా చాలా అవసరం.


ఈ అరికాళ్లల్లో మంటల సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు ఈ టిప్స్ వాడడం వల్ల చాలా సులభంగా ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇందుకోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో చల్లని నీటిని తీసుకోవాలి. అలాగే మరో గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ముందుగా ఆ కాళ్లను వేడి నీటిలో 4 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత కాళ్లను బయటకు తీసి చల్లటి నీటిలో ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. మళ్ళి కాళ్లను తీసి మరో 4 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి.ఇక ఇలా కాళ్లను 4 నిమిషాల పాటు వేడి నీటిలో 2 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచాలి.నీటి వేడిదనం తగ్గే కొద్ది మళ్ళీ వేడి నీటిని పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్లల్లో మంటలు ఈజీగా తగ్గుతాయి. ఇలా వేడి నీటిలో ఉంచడం వల్ల కాళ్లల్లో వేడైన రక్తం వెనక్కి నెట్టబడుతుంది. ఆ భాగాన్ని చల్లబరచడానికి మళ్ళీ కాళ్లల్లోకి కొత్త రక్తం వస్తుంది. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ అనేది మెరుగుబడి కాళ్లల్లో మంటలు తగ్గుతాయి. ఇంకా నరాలల్లో ఉండే వాపు తగ్గుతుంది.అలాగే నరాలపై ఉండే పొర దెబ్బతినకుండా ఉంటుంది.దీంతో అరికాళ్లలో మంటలు చాలా సులభంగా తగ్గుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: