పెద్ద వాళ్ళ నుండి పిల్లల వరకు ఇష్టపడి తినే జామకాయ వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నో. జామకాయలో ఉండే జ్యూస్ కాలేయానికి మంచి టానిక్ లాంటిది. ఈ జ్యూస్ ను తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా షుగర్ ను తగ్గించుకోవచ్చు. జామకాయతో బ్లడ్ లోని గ్లూకోజ్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ ను జామకాయ తగ్గిస్తుంది. ఇకపోతే జామకాయలను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది అని అంటారు.
దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామఆకులు పలువిధాలుగా ఉపయోగ పడతాయని పరిశోధనలు చెపుతున్నాయి. అలాగే జామకాయను రోజూ రెండేసి తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామపండులో విటమిన్ ఎ సిలు ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ పండు తినడం ద్వారా క్యాన్సర్ ను నిరోధించుకోవచ్చు.
ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది అంటారు. జామ లొ కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. జామకాయలో పోషకాలు, విటమిన్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .
అలాగే, జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. అతి తక్కువ ధరతో అందుబాటులో ఉండే ఈ జామకాయను తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను అలోపతి వైద్యులు కూడ గుర్తించారు..