గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనేది ప్రతి తల్లిలో ఉండే అనుమానం. ఎందుకంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని సురక్షితంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటుంది కాబట్టి. అయితే ప్రెగ్నన్సీ సమయంలో పోషకాలు, విటమిన్లు మీకు మీ కడుపులోని బిడ్డకు చాలా అవసరం. ఇక ఇవ‌న్నీ ప‌క్కన పెడితే.. గర్భ సమయం మహిళలకు చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గర్భిణీ మహిళల శరీరంలో కలిగే మార్పులు, వాటిని తట్టుకోవడం వారికి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు.

 

అయితేప్రగ్నన్సీ సమయంలో ఒక్కోసారి కడుపు గట్టిగా అవుతూ ఉంటుంది. దీనికి కార‌ణం ఏంటి అన్న‌ది చూస్తే.. ప్రగ్నన్సీ సమయంలో కడుపు గట్టిగా ఉండటం అనేది సాధారణమేమీ కాదు. కడుపు కండరాలు గట్టిగా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రగ్నన్సీ సమయంలో కడుపు ఇలా గట్టిగా మారటం ఏమైనా ప్రమాదమా ఉందా అని చాలామందికి ఉన్న అనుమానం. ప్రమాదం ఐతే ఏమీ ఉండదు కానీ, కడుపు కండరాలు గట్టిగా ఉండటం వలన గర్భాశయంపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. 

 

అలాగే గర్భాశయ కండరాలు గట్టిగా మారటం వలన మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఇలా గట్టిగా కడుపు ఉండటం వెనుక ఎక్కువ శ్రమ, సెక్స్, రక్తస్రావం, డీ హైడ్రేషన్ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స‌మ‌యంలో వెచ్చగా ఉండే పానీయాలు పాలు, గ్రీన్ టీ వంటి పోషక విలువలు బాగా ఉన్నటువంటి ద్రవాలను తీసుకోవడం వలన కొంచెం ఉపశనంగా ఉండి, కండరాలపై ఒత్తిడి ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం వలన కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే కడుపు కండరాలపై ఒత్తిడి త‌గ్గుతుంది.
 
   

మరింత సమాచారం తెలుసుకోండి: