తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే పరీక్షల కోసం సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రణాళిక ప్రకారం చదివితే తప్పకుండా విజయం విద్యార్థుల సొంతమవుతుంది. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మనూన్యత భావానికి లోనుకాకూడదు. పరీక్షలకు ముందు ప్రశాంతంగా ఉంటే భయాన్ని తొలగించుకోవచ్చు. 
 
విద్యార్థులు ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా సమాధానాలు ఎలా రాశామన్న దానిని బట్టే మార్కులు వస్తాయని గుర్తుంచుకోవాలి. చిన్న ప్రశ్నలకు రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలను వదలకుండా రాయాలి. విద్యార్థులు పరీక్షల సమయంలో గతంలో చదివినంతవరకు మాత్రమే రివిజన్ చేయాలి. కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రతిరోజూ అవసరమైనంత నిద్ర పోవటంతో పాటు ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. 
 
ఇష్టం లేని, కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. కష్టపడి చదవడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతిలో ఉండదని గుర్తుంచుకోవాలి. పరీక్ష సమయానికి గంట ముందు చదవడం ఆపాలి. పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి. ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారు పడకుండా అందరికీ కష్టమైన ప్రశ్నలు అలాగే అనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా చదివి ప్రశాంతంగా పరీక్ష రాస్తే విజయం తప్పక సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: