శృంగారం అనేది చాలా సున్నితమైన అంశం. భార్య భర్తలు ఈ విషయంలో చాలా అవగాహనతో ఉండాలి. వీరిద్దరు శృంగారంలో ఏ ఇబ్బంది పడ్డా ఇందులో పరిపూర్ణమైన అనుభూతిని మాత్రం మిస్ అవుతారనే చెప్పాలి. శృంగారం విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే సీనియర్లకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా జూనియర్లకు.. పెళ్లి కొత్తగా అయిన వారు మాత్రం ఎన్నో అపోహలతో చాలా ఇబ్బందులు పడుతున్నారట.
చాలా మందికి శృంగార జీవితం ఆనందంగా సాగుతున్నా మరి కొంతమందికి మరింత ఎక్కువ శృంగారానందం పొందాలని చూస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే వారు చేయకూడని పనులు చేస్తుంటారు. దీని వల్లే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని సెక్సాలజిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల్లో లైంగీక ఆసక్తి పెంచేందుకు లేహాలు, ట్యాబ్లెట్లు, వయాగ్రాలు వాడాలని కొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేస్తూ ఉంటాయి. వీటి వాడకం వల్ల లేనిపోని సమస్యలు .. సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.
మరి కొందరు వీటిని వాడి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. లైంగీక జీవితంలో భాగస్వాముల మధ్య చిన్న గ్యాప్ వచ్చిన వారు శృంగార జీవితాన్ని సరిగా ఎంజాయ్ చేయలేరు. అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో లేదా డాక్టర్లనో సంప్రదిస్తే మంచిది. మరి కాస్త లైంగీక శక్తిని పెంచుకోవాలన్న ఆరాటం, వయస్సు తగ్గించాలకోవాలన్న కోరిక, శక్తి సామర్థ్యాల కోసం ఒక్క పూట సంతృప్తి కోసం జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధునిక వైద్యంలోనూ లైంగీక సామర్త్యం పెంచే మందులు ఉన్నాయి. అయితే వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.