అయితే ప్రస్తుతం జనరేషన్ లో భార్యాభర్తలు ఇద్దరూ అనేక మంది మానసిక నిపుణుల సలహాల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు జీవితం బాగున్న ఆ తర్వాత మాత్రం మనస్పర్థలు వల్ల తొందరగా దూరమవుతున్నారు. ఒకరికి ఒకరు చెప్పినట్టు వినాలి అనే ఉద్దేశం ద్వారా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొంత మంది మహిళలు వారి పనులు చేయించడం కోసం, వారి మాట నెగ్గించుకోవడానికి కోసం శృంగారం విషయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇందులో చాలామంది ఈ విషయాల ద్వారా వారిద్దరి మధ్య అమాంతం దూరం పెరిగిపోతోంది. ఇలా క్రమంగా జరిగితే కొద్దిరోజులకు శృంగార వాంఛలో పాల్గొనాలన్న కోరిక కూడా పూర్తిగా నశిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు అనేక రకాల మానసిక, లైంగిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
ఏదైనా విషయంలో గొడవలు అంటే కేవలం కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపించినట్టుగా ప్రతిదానికి బెడ్ రూమ్ విషయాన్ని ముడిపెడితే భవిష్యత్తులో భర్తలకు విరక్తి చెంది పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ భర్త ఇలాంటి శృంగార పరమైన విషయాల్లో తక్కువగా ఉంటే ఆ సమయంలో భర్తకు భార్య సపోర్ట్ అందివ్వాలని నిపుణులు తెలుపుతున్నారు. అప్పుడే వారి దాంపత్య జీవితం మరింతగా మారుతుందని తెలుపుతున్నారు. కమిటీ ఏ విషయమైనా సరే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవిస్తే వారి సంసార జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు అజమాయిషీ కొనసాగించు కోవాలని చూస్తే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి